ప్రయాగ్ రాజ్ లో కుంభమేళ ఉత్సవ వేడుకలు చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది భక్తులు స్నానాలు ఆచరించారు. అంతే కాదు ప్రతి రోజు కోట్లలో కుంభమేళకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ సాధులు, అఘోరీలు ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. అయితే, ఒక అమ్మాయిని ఎవరు ఇంటర్వ్యూ చేశారో కానీ సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. ఆమె పేరు మోనాలిసా ప్రస్తుతం ఈ పేరు మారుమోగుతుంది. ఈమె కుంభమేళాలో పూసల దండాలు అమ్ముతుండగా ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేసి వీడియోను అప్లోడ్ చేశారు. ఇక అంతే ఒక్క నైట్ లోనే స్టార్ అయిపోయింది.
ఈమె కోసం యూట్యూబర్ లు, మీడియా వాళ్లు వెంటపడి మరి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. దీని వలన ఆమె చాలా ఇబ్బంది పడుతుంది. మోనాలిసా కళ్ళతోనే మ్యాజిక్ చేస్తుంది. చురుకైన చూపులతో చూసే ప్రతీ ఒకర్ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ అమ్మాయే ఒక సెన్సేషన్. ఈ నేపథ్యంలోనే ఒక బాలీవుడ్ డైరెక్టర్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది కానీ, ఈ న్యూస్ వైరల్ గా మారింది. దీనిపై రియాక్ట్ అయిన నెటిజన్లు కుంభమేళ పుణ్యామా అంటూ ఆమె జాతకమే పూర్తిగా మారిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.