గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ వెయిటెడ్ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ కాగా అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో.. వరుస ప్రమోషన్స్‌తో సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ టీజర్ ఈ రోజు రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. తాగాజా టైమ్ కూడా ఇచ్చేసింది చిత్ర బృందం. ‘సెలబ్రేషన్ చేసేందుకు స్టేజ్ సెట్ చేయబడింది. సాయంత్రం 6:03 గంటలకు కలుద్దాం’ అని చెప్తూ రామ్ చరణ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తోన్న గేమ్ చేంజర్ టీజర్‌కు ఇంక కొద్ది సమయమే ఉండటంతో.. ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.