144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను లగచర్లకు వెళ్లకుండా ఆపుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. సంగారెడ్డి జైలులో వున్న లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారినీ ఈటల పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దుర్మార్గంగా ప్రవర్తించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరన్నారు. కానీ బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటి అని ప్రశ్నించారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.
144 సెక్షన్ పెట్టి అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారు..
