రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్‌ జగన్‌తోనే..

ysrcp-29-1.jpg

గత కొద్ది రోజులుగా వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబూరావు, మేడ రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు ఇలా ఏడుగురు రాజ్యసభ సభ్యులు వైసీపీని వీడెందుకు సిద్ధమైనట్లుగా రూమర్స్ వినిపించాయి. ఈ రూమర్స్ పై గురువారం పిల్లి సుభాష్ చంద్రబోస్ కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.

వైసీపీ పార్టీలోని మెయిన్ పిల్లర్ లలో తాను ఒకడినని అన్నారు. అలాంటి తాను వైసీపీని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సుభాష్ చంద్రబోస్. కలలో కూడా తాను పార్టీ మారనని అన్నారు. వైయస్ జగన్ తనకు ఎటువంటి అన్యాయం చేయలేదన్నారు. జగన్ కి తాను వెన్నుపోటు పొడవలేనని చెప్పుకొచ్చారు. వైసీపీ తనను ఎంతగానో ఆదరించిందన్నారు పిల్లి సుభాష్. పార్టీలు మారితే రాజకీయాలలో విలువలు తగ్గిస్తున్నారన్నారు. తాను రాజీనామా చేస్తే మళ్లీ ఆ పదవి వైసిపికి దక్కే అవకాశం లేదని.. అలాంటప్పుడు అది నైతికత ఎలా అవుతుందని ప్రశ్నించారు.

Share this post

scroll to top