మృణాల్ ఠాకూర్ ఒక్కో డ్రెస్ రేట్ ఎంతో తెలుసా..

murnal-takur-12.jpg

ప్రెజెంట్ ఉన్న జెనరేషన్ లో సౌత్ నుంచి నార్త్ వరకు మంచి ఫేమ్ అండ్ పాపులార్టీ ఉన్న హీరోయిన్స్ నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నారని చెప్పాలి. ఒక పక్క తెలుగులోనే కాకుండా హిందీ మార్కెట్ లో కూడా తమ పాగా వేసి ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లో మన టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్ కూడా ఒకామె కాగా మృణాల్ హిందీ అమ్మాయి అయినప్పటికీ తనకి కెరీర్ పరంగా లైఫ్ ఇచ్చింది మన తెలుగు సినిమానే అయితే జెనరల్ గా హీరోయిన్స్ అనే కాదు ఆడవాళ్లు అంటేనే షాపింగ్, షాపింగ్ అంటే ఆడవాళ్లు అంటారు. ఒకసారి షాపింగ్ కి వెళ్లారు అంటే వేలకి వేలు డబ్బులు ఖర్చు అవ్వాల్సిందే.

ఆమె తన బట్టల కోసం ఎంత ఖర్చు పెడుతుందో తెలిస్తే ఒక్క సామాన్య మహిళే కాదు తన తోటి హీరోయిన్స్ కూడా అవాక్కవల్సిందే. మరి ఇంతకీ మృణాల్ తన బట్టల కోసం ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా? అది ఎంతంటే అక్షరాలా రెండు వేల రూపాయలట. అవును ఈమె తన బట్టలకి కేవలం 2000 మాత్రమే పెడుతుందట. అయితే దీనికి ఆమె దగ్గర ఓ వివరణ కూడా ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తనకి బట్టలపై ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా అనవసరం అనుకుంటుందట. అందుకే తన డ్రెస్ లు కొనేటప్పుడు 2 వేలకి మించి ఖర్చు పెట్టను అని తెలిపిందట. ఇది మాత్రం ఒకింత ఆశ్చర్యకరమే అని చెప్పాలి. ఇంత స్టార్ స్టేటస్ ఉండి కూడా మృణాల్ ఇంత సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడడం చూస్తే ఆమెలోని జాగ్రత్తదనం ఎంతుందో అర్ధం చేసుకోవచ్చు.

Share this post

scroll to top