పచ్చటి అడవితో కనువిందు చేసే, ములుగు జిల్లా ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అలాంటి ఈ ములుగు జిల్లా ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్యాలకు నిలయంగా మారుతుంది. కొద్దిరోజుల క్రితం ఆకస్మిక సుడిగాలి వల్ల 50 వేలకు పైగా చెట్లు నేలమట్టం అయిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం తెల్లవారుజామున.. తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన భూకంప కేంద్రం కూడా ములుగు జిల్లాలోనే ఉంది. దీంతో ములుగు జిల్లాలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం 5.3 తీవ్రతతో మేడారం దగ్గర భూకంపం ఉంది. అలాగే వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి బీభత్సం సృష్టించగా ఊర్ల మధ్యలో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రకృతి వైపరీత్యాలకు కేంద్రంగా మారుతున్న ములుగు..
