తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం..

ravanth-2.jpg

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రెండు రాష్ట్రాల్లోని దాదాపు 400 గ్రామాలు నీటిలో మునిగిపోవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ విపత్తు కారణంగా ట్రాఫిక్ వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా, వర్షాలు, వరదల దృష్ట్యా రెండు రాష్ట్రాల్లోని పరిస్థితి గురించి ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సమాచారం తీసుకున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

Share this post

scroll to top