గంగవ్వకు బంగారం..

bigg-boss-17.jpg

హౌస్ లో మొదట్లో రోజు ఏడుస్తూ ఆ తర్వాత హగ్గులు ఇస్తూ బాగా వైరల్ అయ్యాడు నాగమణికంఠ. దీంతో టాస్కుల్లో సరిగ్గా ఆడకపోయినా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అతన్ని ఇంకా హౌస్ లో ఉంచుతున్నారు. అయితే తాజాగా నాగమణికంఠ గంగవ్వతో మాట్లాడుతూ ఈ వారం నామినేషన్స్ నుంచి నేను సేవ్ అయితే నీకు బంగారు ముక్కుపుడక కొనిస్తాను. సేవ్ అయిన ప్రతివారం అరతులం బంగారం ఇస్తాను అని అన్నాడు. అయితే గంగవ్వ నువ్వు ఇంకా రెండు వారాలే ఉంటావు, నువ్వు ఉండవు అని మణికంఠను ఆటపట్టించింది.

గంగవ్వకు బంగారం ఆఫర్ చేయడంతో హరితేజ నాకు బంగారు వడ్డాణం కావాలి అంటే బేగంబజార్ కి వెళ్లి డూప్లికేట్ కొనిస్తాను అని చెప్పాడు మణికంఠ. ఇక రోహిణి కూడా నాకేమి ఇస్తావు అని అడగడంతో.. నేను సేవ్ అయితే నీకు ఒక ముద్దు ఇస్తాను అని చెప్పడంతో రోహిణి మొదట ఖంగుతిని, నువ్వు సేవ్ అయితే నాకు ఎందుకు ముద్దు అని అంది. దీంతో ఆడియన్స్ నాగమణికంఠ హౌస్ లోపల బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు గా, అందర్నీ కాకాపడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు

Share this post

scroll to top