నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్..

allu-arjun-25.jpg

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప-2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంతేకాకుండా ఈ మూవీ పలు రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం ఈ మూవీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి.

తాజాగా నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మేము మైథలాజికల్ కథతోనే వస్తున్నాము. పురాణాల్లో ఎవ్వరికీ తెలియని కథను త్రివిక్రమ్ రాస్తున్నారు. ఆ గాడ్ పేరు అందరికీ తెలిసినప్పటికీ ఆయన జీవితంలో జరిగిన కథ మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఆ కథనే మేము తీస్తున్నాము. కార్తికేయ స్వామి కథను త్రిక్రమ్ రాస్తున్నాడు. ఆయన రాక ఇక్కడి ప్రజల్ని కాపాడేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో బన్నీ గాడ్ ఆఫ్ వార్‌గా కనిపించే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Share this post

scroll to top