ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు..

nagababu-05.jpg

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నాయకుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోదరుడు కొణిదెల నాగబాబు పేరును ఖరారు చేసింది. బుధవారం జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నాగబాబు పేరును కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. గత కొన్ని నెలలుగా నాగబాబుకు పదవులపై అనేక ఊహగానాలు వస్తుండడంతో వాటికి తెరదించుతూ జనసేన నాగబాబును ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పేరును ప్రతిపాదించింది. నామినేషన్‌ వేయాలని పవన్‌ సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నాగబాబును రాజ్యసభ్యకు పంపుతారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టి రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకుంటారని సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఇటీవల జరిగిన పట్టభద్రులు, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేయడంతో ఈ మూడు పార్టీలకు కలిపి 175లో 164 సీట్లు వచ్చాయి. దీంతో నాగబాబు ఎన్నిక లాంఛనంగానే జరుగనుంది.

Share this post

scroll to top