గవర్నర్ ను కలిసిన నటుడు నాగార్జున..

NAGARJUNA-03.jpg

టాలీవుడ్ సీనియర్ నటుడు కింగ్ నాగార్జున గురువారం మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుతో కలిశారు. కొన్ని రోజుల నుంచి గవర్నర్ హరిబాబు అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి నాగార్జున వెళ్లారు. నటుడు నాగార్జునతోపాటు మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూడా గవర్నర్ హరిబాబుని పరామర్శించారు.

అక్కినేని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు గవర్నర్‌ కంభంపాటి హరిబాబు అయితే, ఇటీవల నెలకొన్న వివాదంపై మాట్లాడేందుకు మాత్రం నాగార్జున నిరాకరించారు. కాగా, తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతూ మధ్యలోకి అక్కినేని ఫ్యామిలీని లాగిన విషయం విదితమే కేటీఆర్‌ వల్లే హీరో నాగచైతన్య-హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్నారని ఆరోపించిన ఆమె హీరోయిన్లు కొంతమంది కేటీఆర్ వల్లే త్వరగా పెళ్లిచేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Share this post

scroll to top