వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ పోలీసులు అరెస్ట్..

nagarjuna-22.jpg

నాగార్జున యాదవ్ కొంతకాలంగా తన వ్యాఖ్యలతో వివాదాల్లో ఉన్నారు.. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే నాగార్జున యాదవ్ అరెస్ట్‌కు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేని పిటిషనర్‌ తరఫున లాయర్ దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలి తప్ప అరెస్టు చేయడానికి వీలు లేదని కోర్టుకు విన్నవించారు. పూర్తి వివరాలు సమర్పించడానికి ఈ నెల 25 వరకు సమయం కావాలని పోలీసుల తరఫు న్యాయవాది సాయిసూర్యతేజ వాదనలు వినిపించారు.

Share this post

scroll to top