తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడింది. నల్గొండ జిల్లాలో అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ అనే యువకుడిని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకుల ముఠాతో దారుణంగా హత్య చేయించారు. 2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. ఈ రోజు నల్లగొండ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు నిందితుల్లో ఒకరికిి ఉరి శిక్ష, మరో నలుగురికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
ప్రణయ్ పరువు హత్య కేసు తీర్పు..
