కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు ఆగ్రహం..

konda-surekha-25-.jpg

మంత్రి కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు వేసింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది. ఓ బాధ్యత కలిగిన మహిళా మంత్రి ఇలాంటి కామెంట్స్‌ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిదని వ్యాఖ్యానించింది. అలాంటి వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని తెలిపింది.

ఆమె వ్యాఖ్యలను మీడియా, సోషల్‌ మీడియా, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇంకెప్పుడూ కేటీఆర్‌ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది. పరువు నష్టం కేసుకు సంబంధించిన ఓ కేసులో మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై కోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయటం ఇదే తొలిసారి. గతంలోనూ కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. 

Share this post

scroll to top