నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక ఘటన మిస్టరీగా మారింది. ఏడు రోజులైనా బాలిక డెడ్‌బాడీ ఆచూకీ దొరకడం లేదు. దాంతో.. బాలిక కోసం సెర్చింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రధానంగా.. పగిడ్యాల మండలం మొత్తం జల్లెడపడున్నారు పోలీసులు. ఈ నెల 7న పార్కులో ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు ముగ్గురు మైనర్లు. ఎవరికీ అనుమానం రాకుండా స్పాట్‌లో క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు క్రియేట్ చేశారు.
ఇదిలావుంటే.. ఏడు రోజులైనా బాలిక డెడ్‌బాడీ ఆచూకీ లభ్యం కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు నిందితులు తప్పుడు సమాచారం ఇచ్చారా?.. అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మరో ట్విస్ట్ నెలకొంది. కేసు దర్యాప్తులో భాగంగా.. మైనర్లతోపాటు వారి తల్లిదండ్రులను విచారించారు పోలీసులు. అయితే.. హత్య తర్వాత బాలికను కాలువలోకి తోసేశామని నిందితులు చెప్తుంటే.. వారి పేరెంట్స్ మాత్రం బాలికను శ్మశాన వాటికలో పాతిపెట్టారని చెప్పడం షాకిచ్చింది.
ఇక.. నిందితుల పేరెంట్స్ చెప్పిన కోణంలోనే ముచ్చుమర్రితోపాటు.. కొణిదెల, వనములపాడు గ్రామాల్లోని శ్మశాన వాటికల్లో తనిఖీలు మొదలు పెట్టారు. అవసరమైతే పాతిపెట్టినట్లుగా అనుమానం వచ్చిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టాలని భావిస్తున్నారు పోలీసులు. ఇప్పటివరకూ కాలువలో గాలించిన పోలీసులు.. ఇప్పుడు బాలిక డెడ్‌బాడీ కోసం శ్మశానవాటికల్లో తనిఖీలు చేపట్టారు.