ఏం చేసినా తన సినిమాల గురించే మాట్లాడుకునేలా చేస్తుంటారు నాని. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో నాని అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. దానికోసం వీలైనంత కొత్తగా ప్రయత్నిస్తుంటారు న్యాచురల్ స్టార్. అందులో భాగంగానే ప్రమోషనల్ సాంగ్స్ ఎక్కువగా చేస్తుంటారు నాని. టాలీవుడ్లో ఈ కల్చర్ ఎక్కువగా ఫాలో అయ్యేది నాని మాత్రమే. నిన్ను కోరి కోసం అడిగా అడిగా అంటూ ఓ ప్రమోషనల్ సాంగ్ చేసారు నాని. అప్పట్లో అది సంచలనం. ఆ తర్వాత కొన్ని సినిమాలకు ఇదే ఫాలో అయ్యారీయన. ఇక అంటే సుందరానికి కోసం చేసిన ప్రమోషనల్ సాంగ్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక గ్యాంగ్ లీడర్ ప్రమోషనల్ సాంగ్ అయితే ఇప్పటికీ సంచలనమే.
అనిరుధ్తో కలిసి ఆ పాటలో అదిరిపోయే స్టెప్పులేసారు నాని. తాజాగా హిట్ 3 కోసం అలాంటి పాటనే చేసారు నాని. తన కోసమే అంటూ సాగే ఈ పాటను ప్రమోషన్ కోసమే షూట్ చేసారు. అనిరుధ్ రవిచంద్ర ఈ పాటను పాడారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి నాని చేస్తున్న ఈ ప్రమోషనల్ సాంగ్స్ సినిమాలకు కూడా బాగానే హెల్ప్ అవుతున్నాయి. అందుకే అదే కంటిన్యూ చేస్తున్నారీయన. తర్వాత సినిమాలకు కూడా ఇదే కంటిన్యూ చేస్తారా.? లేక మరో దారిలో వెళ్తారో చుడాలిక.