అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీ అమరావతికి విచ్చేశారు. తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నరేంద్ర మోడీని సన్మానించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఉగ్రవాద దాడిలో మరణించినవారి కుటుంబాలకు దేశమంతా అండగా నిలుస్తుందన్నారు. పహల్గామ్‌లో మారణకాండ సృష్టించిన వారిని ప్రధాని నరేంద్రమోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరని, ఆయన చేసే మాస్టర్ ప్లాన్‌కు పాకిస్థాన్ నామరూపాల్లేకుండా పోతుందని, పాకిస్థాన్ మిస్సింగ్ అని ఏదొక రోజు వార్తల్లో రావడం ఖాయమన్నారు. ఇక పాకిస్థాన్ వాళ్లు భారత్‌లో గడ్డిని కూడా పీకలేరని, నరేంద్రమోదీ తిరిగి కొట్టే దెబ్బకు పాకిస్థాన్ ఆర్మీ దిమ్మతిరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు.
వంద పాకిస్థాన్‌లకు సమాధానం చెప్పే మిస్సైల్ మనదగ్గర ఉంది..
