ప్రతి సంవత్సరం గణతంత్ర స్వతంత్ర దినోత్సవ వేడుకలు వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్నామని, అర్చకుల ప్రత్యేక పూజలు ఎస్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనం తర్వాత జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఆధ్యాత్మిక క్షేత్రంలో దేశభక్తి పండగల నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. నేటి స్వేచ్ఛ వాయులు నాటి స్వతంత్ర సమరయోధుల త్యాగఫలమేనని,ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ జెండాను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. మరో మారు ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఆలయంలో స్వాతంత్య్ర దినోత్సవ పూజలు..
