ఇటీవల కాలంలో మెరుగైన పనితీరుతో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విశాఖ పోర్టుపై అందరి దృష్టి పడుతోంది. తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్తో వాణిజ్యం కోసం వైజాగ్ పోర్టును రవాణా కేంద్రంగా ఎంచుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. భారత జలరవాణా మంత్రిత్వ శాఖ, బంగ్లాదేశ్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖల మధ్య కొనసాగుతున్న చర్చలు విజయవంతమైతే, బంగాళాఖాతం వెంబడి తూర్పు తీరంలో జలమార్గం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత మెరుగుపడుతుంది. బంగ్లాదేశ్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారుల బృందం ఇటీవల చెన్నై సహా తూర్పు తీరంలోని నాలుగు కీలక ఓడరేవులను పర్యటించింది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు కృష్ణపట్నం ఓడరేవు, విశాఖపట్నం ఓడరేవుల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. పోర్టులు వాటి కార్యకలాపాలు, సామర్థ్యాలను అర్థం చేసుకోకుని వాణిజ్యాన్ని మరింత పెంచుకోవడానికి ఉన్న అవకాశాలును బంగ్లాదేశ్ టీమ్ చర్చించింది.
వైజాగ్ పోర్టుకు మహర్థశ.. ఈ రెండు దేశాల కార్గో ఒప్పందాలపై చర్చలు..
