చీరలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. 

hebha-08.jpg

కుమారి 21 ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఈ భామకు ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మదే మెయిన్ రోల్ కావడంతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ విజయం సాధించింది. అలాగే తన అందం, అభినయంతో కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. దీంతో ఈ భామ గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయి అమాంతం స్టార్ హీరోయిన్ రేంజ్‌లోకి వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు.

కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ఆఫర్లు వచ్చినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం రాణించలేకపోయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. కానీ నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో పాటు వ్యక్తిగత విషయాలు, సినిమా విశేషాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో పర్పుల్ కలర్ చీరలో పద్ధతిగా రెడీ అయింది. నడుము కూడా కనిపించనంతగా ట్రెడిషనల్‌గా రెడీ అయింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు హెబ్బా అంటే అబ్బా అనేలా ఉండాలి. ఇలా పద్ధతిగా ఉంటే కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share this post

scroll to top