దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఇవాళ నీతి ఆయోగ్ తొమ్మిదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే ఈ సమావేశానికి గైర్హాజరు కానున్నారు. విక్షిత్ భారత్ 2024 విజన్ ని ముందుకు తీసుకెళ్లేందుకు నీతి ఆయోగ్ తొమ్మిదో పాలక మండలి సమావేశం ఇవాళ రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనుంది. ‘ఈజ్ ఆఫ్ లివింగ్ పై దృష్టి సారించి, భవిష్యత్తు అభివృద్ధిపై దృష్టి పెట్టండి అనే నినాదంతో ఈ సమావేశం జరగనుంది. ఈ సంవత్సరం థీమ్ విక్షిత్ భారత్ 2047 భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై కేంద్ర దృష్టి సారించిందని నీతి ఆయోగ్ పేర్కొంది.
నేడు నీతి అయోగ్ సమావేశం..
