కొద్దిరోజులుగా హైదరాబాద్, సికింద్రాబాద్లోని పలు రెస్టారెంట్లలో జీహెచ్ఎంసీ సిబ్బందితోపాటు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో హోటల్స్ పరిశీలించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పరిశుభ్రత, నాణ్యత లేని ఫుడ్ రెడీ చేస్తున్న హోటల్స్ కు జరిమానా విధించి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్లోని వివాహ భోజనం హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా.. కాలం చెప్పిన బియ్యంతోపాటు నాసిరకం వస్తువులతో ఆహార పదార్థాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే వండిన ఆహార పదార్థాలు నిలువ చేసి ఫ్రిజ్లో పెడుతున్న తీరును గుర్తించారు. ఫ్రిజ్లో నిల్వచేసిన వస్తువులను వేడి చేసి కస్టమర్లకు అందిస్తున్నారని.. ఫుడ్ ప్రిపరేషన్ కోసం వాడుతున్న నీటి కరిష్టాన్ని కూడా గుర్తించారు. కిచెన్లో పరిశుభ్రత లోపించిందని.. సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బెరను గుర్తించారు. ముందుగా తయారు చేసిన ఉంచిన ఫుడ్ ఎక్స్పైరీ తేదీ లేకుండానే ఉంచారు. ఫుడ్ తయారు చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కూడా లేవని.. వంటపాత్రలను క్లీన్ చేసిన నీరు కూడా అక్కడే నిల్వ ఉండడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు.
సందీప్ కిషన్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. నాసిరకం వస్తువులు గుర్తింపు..
