NTR జయంతి.. తెలుగులో ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్..!

modi6.jpg

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. తెలుగు సినిమాకు ఎన్టీఆర్ గొప్ప స్ఫూర్తి అని కొనియాడారు. దూరదృష్టి కలిగిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి అని పేర్కొన్నారు. తెరపై ఎన్టీఆర్‌ ఎన్నో మరుపురాని పాత్రల్లో నటించి మెప్పించారని తెలిపారు. కాగా నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

“ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ఆయన ధరించిన పాత్రలను , ఆయన నాయకత్వ పటిమను ఇప్పటికీ తలచుకుంటారు ఆయన అభిమానులు . ఆయన కలలు కన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తాము” అని రాసుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.

Share this post

scroll to top