పెరగనున్న ఉల్లిపాయల ధర..

onion-19.jpg

ప్రస్తుతం ఏపీ తెలంగాణలో ఉల్లిపాయల ధర కేజీ రూ.40 నుంచి రూ.60 దాకా ఉంది. ప్రీమియం క్వాలిటీ అయితే ఇంకా ఎక్కువ పలుకుతోంది. ఇంత ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవడం ప్రజలకు భారం అవుతోంది. మధ్యతరగతి, పేద వారు. ఉల్లిధరలు తగ్గాలని కోరుకుంటుంటే, ఇంకా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. కర్నూలు మార్కెట్‌లో 100 కేజీల ఉల్లి ధర రూ.3,700 ఉంది. అంటే కేజీ రూ.37 కింద లెక్క. ఈ ధర మరింత పెరగనుంది. ఇందుకు 2 కారణాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు ఉల్లిపాయల దిగుమతి బాగా తగ్గిపోయింది. అలాగే ఈమధ్య కురిసిన భారీ వర్షాల వల్ల ఉల్లిసాగు బాగా దెబ్బతింది. అందువల్ల సప్లై తగ్గి, ధర పెరిగే ఛాన్స్ ఉంది. ఒకసారి పంట వేస్తే, ఉల్లి దిగుబడి రావడానికి ఏకంగా 100 నుంచి 150 రోజులు పడుతుంది. అందువల్ల ఉల్లి ధరలు పెరిగితే, వెంటనే తగ్గవు.

Share this post

scroll to top