నాకు దూకుడు ఎక్కువ ఉంటే దానం నాగేందర్‌కు గోకుడు ఎక్కువ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ గోకుడు బంజేయాలని సూచించారు. సిగ్గు శరం లజ్జ మానం ఉంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఖైరతాబాద్ లో ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు కాంగ్రెస్‌తో అంటకాగుతున్న అరికెపూడి గాంధీపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం మధ్యాహ్నం మరో బీఆర్‌ఎస్ నేత శంభీపూర్ రాజుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి మరీ ద్వజమెత్తారు. అరెకెపూడీ గాంధీ వ్యవహరించిన తీరును, మాట్లాడిన భాషను ఎండగట్టారు.
ప్రజలు నీకు రౌడీయిజం చేయమని ఓటేసిండ్రా..
