కౌశిక్‌రెడ్డిపై దాడికి సీఎం రేవంత్ రెడ్డే సూత్రధారి..

cong-16.jpg

రేవంత్‌ రెడ్డి సంకుచిత మనస్తత్వం బయటపడిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కాంగ్రెస్‌లో ప్రకంపణలు మొదలయ్యాయని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి డైవర్షన్‌ పాలిటిక్స్‌ మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌తో కలిసి ఆయన హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అరికెపూడి గాంధీని రెచ్చగొట్టి కౌశిక్‌ ఇంటిపై దాడికి పురిగొల్పారన్నారు. వర్షాలతో నష్టపోయిన ఖమ్మం జిల్లాలో హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతలు పర్యటించారని, ఈ సందర్భంగా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన రావడం చూసి రేవంత్‌ తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు.

Share this post

scroll to top