పాస్టర్ ప్రవీణ్ కేసులో షాకింగ్..

praveen-02.jpg

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో షాకింగ్ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.  చిల్లకల్ల టోల్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి ప్రవీణ్ కింద పడ్డారు. మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తృటిలో లారీ టైర్ల కింద పడే ప్రమాదాన్ని ఆయన తప్పించుకున్నారు. ఆ సమయంలో వెనుక ఓ బస్సు కూడా వచ్చింది.  ఆ బస్సు డ్రైవర్ వెంటనే రైట్ తీసుకోవడంతో ప్రవీణ్ కు పెద్ద ప్రమాదం తప్పింది.  వెంటనే కింద పడిన ప్రవీణ్ ను స్థానికులు పైకి లేపి కూర్చొబెట్టారు.  ఆ తరువాత కాసేపటికే బైక్ తీసుకుని రాజమండ్రి వైపు తన ప్రయాణాన్ని కొనసాగించారు ప్రవీణ్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. 

Share this post

scroll to top