ఆసుపత్రిలో కలకలం.. ఉన్నట్టుండి రోగులకు అస్వస్థత.. అసలు కారణం ఇదే..

anakapali-10.jpg

అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి ఏరియా అస్పత్రిలో ఇంజక్షన్ వికటించింది. 23మంది ఇన్ పేషెంట్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వణుకు, జ్వరం, వాంతులతో అవస్థలు పడ్డారు. దీంతో హుటాహుటిన వారందరినీ మెరుగైన వైద్య చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మరొకరికి కేజీహెచ్‎కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్‎లు, జ్వరాలతో వచ్చిన వారికి.. నక్కపల్లి ఏరియా ఆసుపత్రి సిబ్బంది వైద్యం ప్రారంభించారు. సెఫోటాక్సిమ్ ఇంజక్షన్ ఇస్తున్నారు. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి.. ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఇన్ఫక్షన్లతో ఆసుపత్రికి వచ్చిన వారికి ఇంజక్షన్ చేశారు సిబ్బంది. బాధితులు నక్కపల్లి, ఎస్ రాయవరం పరిసర ప్రాంతాలకు చెందిన వారుగా తెలుస్తోంది.

Share this post

scroll to top