ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ క్యాబ్ అసోషియన్స్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్‌లో తిరగనివ్వాలన్న పవన్ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్ వాహన చట్టం ప్రకారం ఇతర రాష్ట్రాల వాహనాలు అనుమతి లేకుండా మరో రాష్ట్రంలో తిరగకూడదన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం పర్మిట్ లేకుండా ఇక్కడ వాహనాలు నడపటం నేరమని చెప్పారు. మోటరు వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించడం సరైంది కాదనే విషయనాన్ని పవన్ గుర్తుంచుకోవాలని చెప్పారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన క్యాబ్ డ్రైవర్ల వాగ్వాదంతో ఈ వివాదం మెుదలైంది. ఎయిర్‌పోర్టులో కొందరు ఓకే వాహనానికి ఏపీ, తెలంగాణ రెండు నెంబర్ ప్లేట్లతో వాహనాలు నడుపుతున్నారు. దీంతో తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు.. ఏపీ క్యాబ్ డ్రైవర్లను ప్రశ్నించారు. ఈ ఘటన తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు ఆగ్రహం..
