డేట్లు ఇచ్చేసిన పవన్ ఎట్టకేలకు రీ స్టార్ట్..

og-12.jpg

 పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ మూవీ షూటింగ్ ఈ రోజు రీ స్టార్ట్ అయింది. మూవీ టీమ్ ఓ పోస్టర్ తో ఈ అప్డేట్ ఇచ్చింది. ఈ పోస్టర్ లో సుజిత్, అతని టీమ్ షూటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సెట్స్ లో పవన్ కల్యాణ్‌ ఇంకా జాయిన్ కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి వేరే నటులతో చేస్తున్నారు. త్వరలోనే పవన్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ప్రకటించింది. ‘మళ్లీ మొదలైంది.. ఈ సారి ముగించేద్దాం’ అంటూ ప్రకటించింది. పవన్ కల్యాణ్‌ వరుసగా డేట్లు ప్రకటించారంట.

వీలైనంత త్వరగా మూవీని కంప్లీట్ చేసేసి సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని చెప్పారంట. ఓ వైపు హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్ ఇప్పుడు ఓజీని పూర్తి చేసేసి మళ్లీ రాజకీయాల్లో బిజీ అవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ స్టార్ట్ అయి రెండేళ్లు కావస్తోంది. కానీ ఎన్నికల టైమ్ లో పవన్ బిజీ అయిపోవడం వల్ల ఆగిపోయింది. ఈ సారి మాత్రం బ్రేక్ లేకుండా కంప్లీట్ చేయబోతున్నారు. త్వరలోనే మూవీ షెడ్యూల్ ను ప్రకటించనున్నారు.

Share this post

scroll to top