జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కు జరిగిన ప్రమాదంపై తనకు అందిన వివరాలను సోమవారం రాత్రి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కీలక నేతలు తనకు ధైర్యం చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన పవన్ వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జనసేన శ్రేణులు, సినీ ప్రముఖులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మోదీకి బాబు, జగన్ కూ ధన్యవాదాలు..
