తెలంగాణలో విగ్రహ రాజకీయం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మరికాసేపట్లో ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో రాజీవ్ విగ్రహంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విగ్రహావిష్కరణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను క్షమించదంటూ కామెంట్ చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ చదువుకున్నానని చెప్పుకునే కేటీఆర్ రాజీవ్ విగ్రహ ఏర్పాటు విషయంలో రాద్ధాంతం చేయడం తగదంటూ హెచ్చరించారు. దీంతో ఇరువురి మధ్య డైలాగ్ వార్ హాట్‌హాట్‌గా మారింది.
కేటీఆర్ కు పీసీసీ చీఫ్ కౌంటర్..
