వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిన్నారి అశ్వియ అంజూమ్ హత్య నేపథ్‌యంలో ఈ నెల 9వ తేదీన అశ్వియ అంజూమ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు పుంగనూరు పర్యటనకు సిద్ధమయ్యారు వైఎస్ జగన్.. అయితే, జగన్ పర్యటన రద్దు చేసుకున్నట్టు ఈ రోజు వెల్లడించారు పెద్దిరెడ్డి. చిన్నారి మృతి అందరినీ కలచి వేసిందన్న ఆయన కర్నూలులో లాగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే జగన్ పుంగనూరు రావాలనుకున్నారు. అయితే, వైఎస్ జగన్ పర్యటన అనగానే హడావిడిగా ముగ్గురు మంత్రులు పుంగనూరులో పర్యటించారు. పోలీసులు కూడా ముగ్గురు దోషులను అరెస్టు చూపించారని వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం ఈ నేపథ్యంలోనే పుంగనూరు పర్యటనను వైఎస్ జగన్ రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు.
వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు..
