పెద్ది ఫస్ట్ షాట్.. హిస్టరీ క్రియెట్స్..

pedhi-07.jpg

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డు విన్నెర్ ఏ ఆర్ రెహామాన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీరామనవమి కనుకాగా పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ను ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేసారు మేకర్స్.

ఉరమస్ లుక్ లో రామ్ చరణ్ సూపర్బ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఇప్పుడు ఈ పెద్ది ఫస్ట్ షాట్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. పెద్ది ఫస్ట్ షాట్ విడుదలైన 21 గంటల్లో 30.6 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇప్పటి వరకు హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టిన గ్లిమ్స్ రాబట్టిన లిస్ట్ ఓ సారి చూస్తే రికార్డు యంగ్ టైగర్ దేవర సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిన 24 గంటల్లో 26.17 మిలియన్స్ కొల్లగొట్టింది. ఆ తర్వాతి మూడవ స్తానంలో సూపర్ స్టార్ గుంటూరు కారం 20.98 మిలియన్స్, నాలుగవ స్థానంలో అల్లు అర్జున్ పుష్ప ది రూల్ 20.45 మిలియన్స్. 5వ ప్లేస్ లో నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ 17.12 మిలియన్స్ రాబట్టింది. ఏదేమైనా బుచ్చిబాబు మాస్ టేకింగ్ మెగాభిమానులకు విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న పెద్ది 2026 మార్చి 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Share this post

scroll to top