సంచలనం సృష్టించిన పెద్ది..

pedhi-17.jpg

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ మాయాజాలకారుడు ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన, ఈ సినిమా, నుండి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కి మంచి స్పందన లభించింది, మూవీ పై హైప్ మరింత పెరిగింది. డి గ్లామరస్‌గా చరణ్ లుక్ మాత్రం అధిరిపోయింది అని చెప్పాలి. ఒకే ఒక్క బాల్ షాట్‌తో సోషల్ మీడియాను షేక్ చేశాడు. ఇక తాజాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్‌పై సంచలన సమాచారం బయటకు వచ్చింది.

ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లీక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి సొంతం చేసుకుందని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.105 కోట్లకు తీసుకుందట. ఈ రేటు, తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన డిజిటల్ రైట్స్ ఒప్పందాల్లో, టాప్ రేంజ్‌లో నిలిచింది. ఈ డీల్‌తో పెద్ది సినిమాపై ఉన్న క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రానప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

Share this post

scroll to top