అనకాపల్లి జిల్లా ఎస్ఈజెడ్‌లలోని ఫార్మా, కెమికల్ కర్మాగారాల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. అచ్యుతాపురం ఎసెన్షియాలో రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదం 18 మందిని పొట్టన పెట్టుకొన్న సంగతి తెలిసిందే. ఇందులో గాయపడిన 30 మందికి పైగా ఉద్యోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇది మరచిపోకముందే శుక్రవారం తెల్లవారు ఝామున పరవాడ ఫార్మాపార్క్‌లోని సినర్జీస్ ఫార్మాలో రియాక్టర్ లీకై నలుగురు కార్మికులు గాయపడ్డారు. నెల రోజుల వ్యవధిలో అనకాపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.
భద్రతను గాలికి వదిలేశారా..
