భారతదేశంలో మధుమేహం ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది ప్రస్తుతం జనాభాలో 11.4 శాతం అంటే, దాదాపు 101 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోంది. అలాగే జనాభాలో 15.3శాతం లేదా దాదాపు 136 మిలియన్ల మంది ప్రజలు ప్రీ-డయాబెటిక్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండటానికి, దానిని సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం. ఇందులో ఆహారం, వ్యాయామం కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు దినచర్యలో యోగా, నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి ఖచ్చితంగా చేయాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ లోపం ఉన్నప్పుడు, అంటే తక్కువ మొత్తంలో ఇన్సులిన్ పంపిణీ అవుతుంది, అప్పుడు రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిని మధుమేహం అంటారు. మధుమేహానికి ప్రధాన కారణాలలో జీవనశైలి, ఒత్తిడి , అధిక మద్యపానం ఉన్నాయి. అంతేకాదు డయాబెటీస్ కు ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..
