న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ ను జర్మీనీ ఎడిషన్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. గురువారం ప్రారంభమైన ఈ సమ్మిట్ లో భారత్ కు చెందిన పలువురు కేంద్ర మంత్రులతో పాటు జర్మనీ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కాగా రెండో రోజైన నేడు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈరోజు పలు ఆసక్తికరమైన అంశాలు చర్చకు రానున్నాయి. టీవీ నెట్‌వర్క్‌కు చెందిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జర్మన్ ఎడిషన్ లో నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు ప్రధాని పాల్గొంటున్నారు. కాగా అందుకు ముందు మోదీ జర్మనీకి చెందిన నాయకులు, కార్పొరేట్ నాయకులతో పాటు పలువురు ప్రముఖ క్రీడకారులతో భేటీ కానున్నారు.