ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం న్యూయార్క్ లోని నస్సావ్ వెటరన్స్ కొలస్సియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సుకు దాదాపు 13వేల మంది హాజరయ్యారు. భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 382 మంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులు ప్రదర్శనలిచ్చారు. అనంతరం ప్రవాస భారతీయులను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. ఒకవైపు భారత్ చేస్తున్న శాంతి ప్రయత్నాలను ప్రస్తావిస్తూనే మరోవైపు వివిధ రంగాల్లో భారత్ సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు. ఇది యుద్ధ యుగం కాదని భారత్ చెప్పినప్పుడు ప్రపంచం సీరియస్ గా వింటుందని అన్నారు. అమెరికా కంటే భారత్ 5జీ మార్కెట్ పెద్దదని మోదీ అన్నారు.
భారత్ చెబితే ప్రపంచం వింటుంది..
