విజయవాడలో 10 మంది ఉగ్రవాదులు..

vijayawada-25.jpg

విజయవాడ ప్రజలకు బిగ్ అలెర్ట్. విజయవాడలో 10 మంది ఉగ్రవాదులు ఉన్నారని అంటున్నారు. విజయవాడలో ఉగ్ర కదలికలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. సిమి సానుభూతి పరుల గురించి 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి విజయవాడ పోలీసులకు సమాచారం అందింది. దీంతో 10 మంది అనుమానితులపై నిఘా పెట్టారు. వీరు గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేట ప్రాంతాల్లో వేర్వేరు పనులు చేస్తున్నట్టు గుర్తించారు. గతంలో విజయవాడ మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా నిలిచింది. జమ్ము కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్ర దాడులు జరిగిన నేపథ్యం లో విజయవాడలో కూడా ఆ పది మంది ఉగ్రవాదులు రెచ్చిపోయే ప్రమాదం పొంచి ఉందని కూడా అంచనా వేస్తున్నారు పోలీసులు. వెంటనే వాళ్ళను గుర్తించి, అరెస్టు చేయాలని కూడా అనుకుం టున్నట్లు తెలుస్తోంది. కాగా జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఏకంగా 28 మంది యాత్రికులు మరణించారు. ఇందులో ఇద్దరు విదేశీయులు కాగా 26 మంది మన ఇండియన్స్.

Share this post

scroll to top