విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పొలిటికల్‌గా హీట్..

vizag-12.jpg

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎన్నికకు సమయం దగ్గర పడేకొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ విజయం కోసం పక్కాగా ప్లాన్‌ చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్‌ సీటు చేజారనివ్వొద్దని భావిస్తున్నారు జగన్‌. విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రలోభాలు లొంగిపోవద్దని బెదిరింపులకు భయపడొద్దని నేతలకు సూచించారు. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ కూడా ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట ప్రాంతాల్లో పర్యటించి పార్టీ కేడర్‌తో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. ఇప్పటికే తమ నేతలను వైసీపీ బెంగళూరు క్యాంప్‌కు తరలించింది. ఆగస్టు 12న వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని మాజీమంత్రి ధీమాగా ఉన్నారు.

Share this post

scroll to top