మాటలతో కాదు ఇందిరమ్మ ప్రభుత్వం చేతలతో చేసి చూపిస్తుందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన చేసుకుంటున్నామన్నారు. పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దతో పనిచేస్తుందన్నారు. విద్య, వైద్యానికి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ప్రభుత్వపాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అమ్మ ఆదర్శపథకంతో రూ. 657 కోట్లు తో ప్రభుత్వం వచ్చిన ముడునెల్లోనే చేపట్టి సౌకర్యాలు కల్పించిందన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసిందిఏమిలేదన్నారు.
పొంగులేటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన..
