హైదరాబాద్ నగరంలో ప్రజల మధ్యకు వెళ్లి ప్రత్యక్షంగా వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ , రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కలిసి RTC బస్సులో సాధారణంగా టికెట్ తీసుకొని ప్రయాణించారు. పంజాగుట్ట నుంచి లక్డికపూల్ వరకు బస్సు ప్రయాణం చేస్తూ, వారు ఇతర ప్రయాణికులతోపాటు మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహా లక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఉద్యోగానికి వెళ్లే మహిళలు, అవసరాల నిమిత్తం ప్రయాణించే వారు ఈ పథకంతో ఎంతో లబ్ధి పొందుతున్నారని చెప్పారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడిన మంత్రి, వారి అభిప్రాయాలను స్వయంగా వినడంతో పాటు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.
ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్..
