యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. విజయ్ బీస్ట్, ఆచార్య, రాధే శ్యామ్ వరుసగా ప్లాప్ కావడంతో రేసులో వెనుకపడింది. మేకర్లు సైతం ఆమెను సినిమాల్లో తీసుకునేందుకు ఆలోచించారు. దీంతో కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పూజా ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ మళ్లీ ఫామ్‌లో వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆమె చేతిలో ఓ 4 నాలుగు చిత్రాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ అమ్మడు షాహిద్ కపూర్ సరసన ‘దేవా’ మూవీ నటించే చాన్స్ అందుకుంది. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ మూవీ జనవరి 31న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ క్రమంలో ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న పూజా పొట్టి బట్టలు ధరించి కవర్ చేసుకోలేక ఇబ్బంది పడింది. కనిపించకుండా చేతులు అడ్డుపెడుతూ మాట్లాడింది. కొన్నిసార్లు సినిమా బాగుందని అంటారు. కానీ వాటికి కలెక్షన్స్ రాకపోవడంతో ఓ పదేళ్ల తర్వాత క్లాసిక్ అనేస్తారు. నా వరకు కలెక్షన్లు అని కాకుండా ప్రతి సారి కొత్త కథను, కొత్త పాత్రలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నానా లేదా అనే చూస్తాను. ట్రెండ్ ఫాలో అవుతూ దానికి తగ్గట్టు సినిమాలు చేస్తా అని చెప్పుకొచ్చింది. నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముందు డ్రెస్‌లు మంచివి ధరించమని సలహా ఇస్తున్నారు.