ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దేవర ఒకటి. ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. మొదటిసారి ఎన్టీఆర్, జాన్వీ జోడీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఇందులో బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.
దేవర డబ్బింగ్ స్టార్ట్.. పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
