కల్కి 2898 ఎడి చిత్రం సక్సెస్‌పై ప్రభాస్ స్పందించారు. నిర్మాణ సంస్థ విడుదల చేసిన వీడియోలో తన అభిమానులకు, దర్శకనిర్మాతలకు తోటి నటీనటులకు కృతజ్ఞతలు చెప్పారు. ‘‘అభిమానులు లేకపోతే నేను జీరో. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ నుంచి ఎంతో నేర్చుకున్నా. రెండో భాగం మరింత భారీతనంతో ఉంటుంది. కల్కి మొదటి భాగానికి ఇంత భారీ విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు’’ అని ప్రభాస్ అన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించడమే కాక కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు చెబుతు ఓ వీడియో విడుదల చేసింది.
కల్కి సక్సెస్‌పై ప్రభాస్ ఏమన్నారంటే..
