ప్రభాస్ లైనప్‌లో ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న క్రేజీ మూవీ స్పిరిట్. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్ సినిమా మీద అంచనాలు డబుల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలో ప్రభాస్ లుక్స్‌కు సంబంధించిన న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాలో ప్రభాస్‌ను ఫస్ట్ టైమ్ పోలీస్ డ్రెస్‌లో చూపించబోతున్నారు సందీప్. యానిమల్‌తో ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్ సెట్ చేసిన సందీప్, డార్లింగ్ సినిమాను అంతకు మించి అన్న రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు.
ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సందీప్, ప్రజెంట్ మ్యూజిక్ సిట్టింగ్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌ను నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా డార్లింగ్ కోసం మూడు డిఫరెంట్ లుక్స్‌ను డిజైన్ చేస్తున్నారు. ఆ లుక్స్ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు డైరెక్టర్. భాస్ కూడా రాజాసాబ్ వర్క్ ఫినిష్ అయిన వెంటనే, హను రాఘవపూడి సినిమాతో పాటు స్పిరిట్ ను కూడా పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.