వారిని జైలుకు ఎందుకు పంపట్లేదు సీఎంకు మాజీ ఐఏఎస్ లేఖ..

gasss-27.jpg

పరిశ్రమల్లో తరుచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలంటూ సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌. నర్సింగరావు మాట్లాడుతూ ప్రైవేట్‌ పరిశ్రమల్లో సేప్టీ ఆడిట్‌ జరిపి భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ఘోర దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలన్నారు. ఎల్‌జి పాలిమర్స్‌ ప్రమాదం జరిగిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. పరిశ్రమల్లోకి వెళ్లిన కార్మికుడు తిరిగి సేప్టీగా తిరిగి వస్తాడన్న గ్యారంటీ లేదన్నారు. భద్రతా చర్యలు లేకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయన్నారు. పని ప్రదేశంలో భద్రత కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. ఫార్మా కంపెనీల వారు లాభాలు సంపాదించుకొని ధనవంతులుగా మారుతున్నారు తప్ప కార్మికులకు భద్రత కల్పించడం లేదన్నారు. యజమానులపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకుండా వారికి అండగా నిలవడం సరైంది కాదన్నారు.

Share this post

scroll to top