సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2. ఈ చిత్రం పుష్ప సినిమాకి సీక్వెల్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ లపై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. కిస్సిక్ అంటూ ఈ పాట సాగనుందని చెప్పింది. పుష్ప మూవీలో ఊ అంటావా మామ ఎలాగైతే అలరించిందో అంతకంటే ఎక్కువగా కిస్సిక్ పాపులర్ అవుతుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది.