ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. డిసెంబర్ 5న తెలుగుతోపాటు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్ కానుండడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ వేగం పెంచిన మేకర్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈవెంట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 6 గంటలకు యూసుఫ్ గూడలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర పేరుతో ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఆ దారిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు ప్రతి క్షణం దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే నార్త్ లో ఈసినిమా క్రేజ్ మాములుగా లేదు. నార్త్ రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన పుష్ప 2 పోస్టర్స్ కనిపిస్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గపడుతుండడంతో బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియో చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ముంబైలో ఓ మెట్రో ట్రైన్ మొత్తం పుష్ప 2 స్టిక్కర్స్ తో నింపేశారు. ట్రైన్ మొత్తం పుష్ప 2 పోస్టర్స్ అతికించడంతో చూసేందుకు కన్నుల పండగా కనిపిస్తోంది. దీంతో ఈ వీడియోను షేర్ చేస్తూ ఉత్తరాదిలో బన్నీ క్రేజ్ ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఇప్పటికే సెన్సార్ ప్రక్రియ పూర్తైంది.